వ్రాసినది: యస్.పాలకుర్తి | సెప్టెంబరు 5, 2008

కొత్త బంగారు లోకం (నేననీ నీవనీ)

 

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం  పిలిస్తే..

మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా..

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం  పిలిస్తే..

పదము నాది పరుగు నీది
రధమువైరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషంకమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా

నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం  పిలిస్తే..

వ్రాసినది: యస్.పాలకుర్తి | సెప్టెంబరు 5, 2008

కొత్త బంగారు లోకం (నిజంగా నేనేనా)

 

నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి
అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకె ఉంటూ
నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేలోనా
ప్రేమా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నదేలోనా
ప్రేమా

నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా

ఈ వయస్సులో ఒకో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడిచిన కాలం
వింతని నమ్మనుగా

నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే
నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే
ఈ  వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట
పరవసమేదో తోడవుతుంటే
పగలే తీరా గగనంలోనా
తారలు చేరెనుగా

నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి
అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకె ఉంటూ
నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేలోనా
ప్రేమా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నదేలోనా
ప్రేమా

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 19, 2008

అష్టాచెమ్మ (ఆడించి అష్టాచెమ్మ)

(ఇక్కడ వినండి)

ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మ
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మ
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే

ఆ. ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఊ ఊ హూ.. ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూసాక నిన్ను వేసాక కన్ను వెనెక్కెలాగ తీసుకోనూ
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ బాటలో
నీదాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే

ఆ.. నానేరం ఏముందే ఏంచెప్పిందో నీ తల్లో జేజమ్మా
ఊ ఊ హూ. మందారం అయ్యింది ఆరోషం కాపీ జళ్ళొ జాజమ్మ
పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి ఊఅంది గుండె నిన్నదాకా
ముళ్ళంటి కోపం వళ్ళంత అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా.. మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవీలేవీ అంత కొత్తేం కాదమ్మా

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 19, 2008

అష్టాచెమ్మ (హల్లో అంటూ పిలిచి)

(ఇక్కడ వినండి)

హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచీ
ఎందుకు నీతొ పేచీ
ఇచ్చేదేదో ఇచ్చీ
వచ్చై నాతో రాజీ

కోలకంటి చూపా
కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా
తాళవా ప్రతాపా
హా.
బెదరకే పాపా
వదలని కైపా
నువు కనబడి కలవరపడి
తెగ ఎగసిన మగ మనసిది
వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి
కీడెంచి మేలెంచి హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

ఆరా తీసేవాళ్ళు పహరాకాసే వాళ్ళు
దారంతా ఉంటారు ఔరా జాగర్త
ఎందర్నేమారుస్తాం?
ఇంద్రజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం
మన్మద మంత్రం వేద్దాం
రేయిలాంటి మైకం
కప్పుకొని ఉందాం
మాయదారి లోకం
కంటబడదందాం
మన ఏకాంతం
మనకే సొంతం
అష్టదిక్కులన్నీ
దుష్టశక్తులల్లే
కట్టకట్టుకొచ్చి
చుట్టుముట్టుకుంటె
యుద్దనికి సిద్దం అనుకుందాం
పద్నాలుగు లోకాలను మొత్తం
ముద్దుల్లో ముంచేద్దాం
ఆరా తీసేవాళ్ళు పహరాకాసే వాళ్ళు
దారంతా ఉంటారు ఔరా జాగర్త

పిల్లకి మెళ్ళో పుస్తె కట్టేదెపుడంట
పిల్లికి మెళ్ళో గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవే చిట్టి
చంపకు ఊదరగొట్టి
దగ్గర దగ్గర ఉండి
తగ్గదు బాదర బందీ
ఆవురావురంది ఆకలాగనంది
ఆవిరెక్కువుంది అంటుకోకు అంది
హాయ్ తట్టుకోడమెల్లా ముట్టుకుంటే ఎల్లా?
విస్తరాకు నిండా విస్తరించి ఉన్న
విందు చూస్తు కూడా పస్తులుండమని
ఎవ్వరిదీ శాసించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం
ఐనా పెడతా శాపం హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచీ
ఎందుకు నీతొ పేచీ
ఇచ్చేదేదో ఇచ్చీ
వచ్చై నాతో రాజీ
కోలకంటి చూపా
కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా
తాళవా ప్రతాపా
హా.
బెదరకే పాపా
వదలని కైపా
నువు కనబడి కలవరపడి
తెగ ఎగసిన మగ మనసిది
వాలిందే నీపై ఎగిరొచ్చి
ఊ హూ..
నేనేగా ఆపా ఎదురొచ్చి
ఊ హూ హు.
కీడెంచి మేలెంచి హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 15, 2008

వందేమాతరం

(ఇక్కడ వినండి)

వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం
మలయజశీతలాం
సశ్యశ్యామలాం
మాతరం
వందేమాతరం
సుప్రజ్జోస్నా పులకితయామినీం
పుల్లకు సుమిత
ద్రుమధళశోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం
వందేమాతరం
వందేమాతరం

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 14, 2008

శ్రీనివాస్ గజల్స్ (ఒక్కసారి ఊరుపోయిరా)

(ఇక్కడ వినండి)

ఏరా రాముడూ ఊడుపులైపోయినియేంట్రా
లేదురా రేపో మాపో మొదలెడతాను
సరే సాయంత్రం సావిడికాడికొచ్చెయ్
అక్కడ కబుర్లు సెప్పుకుందాం
అలాగే  త్రూ.. హై హై హై

ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెల కోసం
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెల కోసం

సంక్రాంతి ముగ్గుల్లు గొబ్బిళ్ళో
మాలక్ష్మి దీవించు గొబ్బిళ్ళో
మాలక్ష్మి దీవించు గొబ్బిళ్ళో
మా ఊరికివ్వాలి పంటల్లు

ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు
ముద్దొచ్చే అమ్మాయిలు.. హాయ్ దిద్దే ముగ్గుల గీతలు
ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
పడుచుల జడ గంటలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా..

అందరినీ పలకరించూ
కథలెన్నో వినిపించూ
ఏరా రాముడూ ఈ మద్య కనిపించట్లేదేమిట్రా
అందరినీ పలకరించూ
కథలెన్నో వినిపించూ
ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
ముసలి అవ్వలకొసం
ఒక్కసారి ఊరు పోయిరా

చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు
రామ నవమి పందిరిలో నాటకాల సందడిలో
బావా ఎప్పుడు వచ్చితీవు..
రామ నవమి పందిరిలో నాటకాల సందడిలో
ఒక్కసారి ఊరు పోయిరా
నాన్నా..
ఒక్కసారి ఊరు పోయిరా
అల్లరి పిల్లలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా

ఏటిగట్టు సరదాలు
పాటమీద పగ్గాలు
ఏరా ఎంకన్నా మేట్నీకొత్తావేంట్రా ఈరోజూ?
ఆ కుదరదురా సాయంత్రం వెంకటలక్ష్మి తోటకి రమ్మందిర
ఏటిగట్టు సరదాలు
పాటమీద పగ్గాలు
ఒక్కసారి ఊరు పోయిరా
మిత్రమా..ఒక్కసారి ఊరు పోయిరా
చిననాటి మనసుల కోసం
ఒక్కసారి ఊరు పోయిరా

తాననన్న తాననన్న తాననన్న హో..
తననానన తననానన

పల్లెటూరి పిల్లకదా..
పట్నం రాలేదు కదా.
ఓ హొహొ హొహొ ఓ హొహొహొహొ హొయ్
పల్లెటూరి పిల్లకదా..
పట్నం రాలేదు కదా.
ఒక్కసారి ఊరు పోయిరా
ఒక్కసారి ఊరు పోయిరా
కురిసే వెన్నెల కోసం

ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
బతికిన పల్లెలకోసం
ఒక్కసారి ఊరు పోయిరా
అనుభూతుల మల్లెలకోసం
ఆ ఏరులకోసం ఆ నవ్వులకోసం
ఆ కోవెలకోసం ఆ పొలాల కోసం
ఆ సిగ్గులకోసం చలిమంటలకోసం
ఆ పంటలకోసం ఆ వెన్నెలకోసం..

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 14, 2008

సుబ్బు (ఐ లవ్ మై ఇండియా)

 

 

 

 

 

 

(ఇక్కడ వినండి)

డూ యూ హియర్ మీ?
యా..

లేడీస్ అండ్ జంటిల్మేన్
డూ యూ లవ్ మీ?
యా..

డూ యూ లవ్ యువర్ మమ్మీ అండ్ డాడీ?
వైనాట్?

సో దట్

డూ లవ్ మధరిండియా
యూ టూ లవ్ ఇండియా
డూ లవ్ మధరిండియా
యూ టూ లవ్ ఇండియా

 

జననీ జన్మభూమినీ
స్వర్గమన్నదో కవికులం
ఏదీ అది ఎక్కడో
వెతకమంటుంది గురుకులం
గుండెపిండుకుని తాగిన
గుక్కెడు పాలగురుతులేనప్పుడు
పోత పాల సీసాలకోసమే
పరుగులాటలే ఎపుడూ

సో దట్ వాట్ యూ సే?
ఐ లవ్ మై ఇండియా
లవ్లీ మదరిండియా
యూ టూ లవ్ ఇండియా
డూ లవ్ మదరిండియా

ఆకాశంలో ఆ సూర్యుడొక్కడే
అభ్యుదయంలో నాదేశమొక్కటే
ఆ సూర్యుడెప్పుడూ తూర్పు దిక్కునే
ఎంచుకు పుడతాడు
కళ్యాణ తిలకమై కన్నతల్లి
ఒడిలోనే ఉంటాడు
అలాంటిదేరా నా భారతదేశం
సనాతనంలో సమిష్టిదేశం
ఆ సనాతనం తన పునాదిలోనే
సంకరమవుతుంటే
ఆ అభ్యుదయానికి సభ్యసమాజమే
సమాధి కడుతుంటే
తరతరాల ధాస్యం తెంచుకున్న
ఈ స్వరాజ్య దేశంలో
యువతరాలు మళ్ళీ పరాయి బిక్షకు
పరుగులూ తగునా

ఐ లవ్ మై ఇండియా
లవ్లీ మదరిండియా
యూ టూ లవ్ ఇండియా
డూ లవ్ మదరిండియా

పరాయి దేశంలో కిరాయి కోసమని
స్వదేశ జ్ఞానం సమాధి కడుతుంటే
ఆ కూలి డబ్బు డాలర్లలోనె
సుఖజీవనముందంటే
ఆ  పాలెకాపు నీ పాలి శత్రువై
తిరిగి వెళ్ళమంటే
కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై
కన్న తండ్రికే అది మూగ వేదనై
ఆ నారు పోసి నీరెట్టినోళ్ళకు
ఫలితం ఏముంది
ఈ పుణ్య భూమిలో పుట్టినందుకు
ప్రతిష్ట ఏముంది
ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే
సిగలో ముడిచిన తల్లికి
దురాగతాల తురాయి పూవులు
అలంకరించుట న్యాయమా
ధర్మమా?

ఐ లవ్ మై ఇండియా (6)

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 14, 2008

సుభాష్ చంద్ర బోస్ (జైహింద్ జైహింద్)

(ఇక్కడ వినండి)

జైహింద్ జైహింద్
జైహింద్ జైహింద్

సుభాష్ చందు అణువణువునందు
అడుగడుగునందు జైహింద్
స్వేచ్చనే పొందు పోరాటమందు
మనమంత ముందు జైహింద్
తెల్లరాబందు మనదేశమందు
ఉండొద్దు ఎందు జైహింద్
దోపిళ్ళు బందు దొరతనము బందు
తొడగొట్టమందు జైహింద్

వందే..మాతరం వందే.. మాతరం
వందే.. మాతరం వందే.. మాతరం

పిడికిళ్ళు అగ్గి పిడుగుల్ని చేసి
కురిపించమంది జైహింద్
కన్నీళ్ళ ధార ఖఢ్గాల ధార
కావాలి అంది జైహింద్
గాయాలలోన ధ్యేయాన్ని చూసి
కదలాలి అంది జైహింద్
రక్తాలు చిందు త్యాగాల విందు
ఆజాదు హిందు జైహింద్

వందే..మాతరం వందే..మాతరం
వందే..మాతరం వందే..మాతరం

జైహింద్ జైహింద్

స్వారాజ్యమింక మన జన్మ హక్కు
అంటుంది జెండా జైహింద్
మన గుండెలన్ని జెండాలో
ధర్మ చక్రాలే చూడు జైహింద్
అరచేయి అడ్డు పెట్టేసి
సూర్యునాపేది ఎవడు జైహింద్
ఆంగ్లేయ గుంటనక్కలే
మనలాపేయలేవు జైహింద్
నలబది కోట్ల జనమంత
ఇంక కట్టారు జట్టు జైహింద్
మన భరతమాత పాదాల మట్టి
బొట్టుగా పెట్టు జైహింద్

వందే..మాతరం వందే..మాతరం
వందే..మాతరం వందే..మాతరం

జైహింద్ జైహింద్

బుల్లెట్ల వాన అల్లూరిపైన
కురిసింది నాడు జైహింద్
తల తెగినగాని తలవంచబోడు
మన తెలుగువాడు జైహింద్
పుడతారు వేల వీరులే
ఒక్క వీరుడే ఒరిగి జైహింద్
పుడతాయి విప్లవాలెన్నో
వీర రక్తాలే చింది జైహింద్
ఒకసారి కాదు వెయిసార్లు మళ్ళి
పుడతాడు అతడు జైహింద్
ద్రోహులను చీల్చి చెండాడె
సింహమవుతాడు అతడు జైహింద్


వందే..మాతరం వందే..మాతరం
వందే..మాతరం వందే..మాతరం

వందే.. మాతరం వందే..మాతరం
ఆహా… ఆహా….

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 14, 2008

రాక్షసుడు (జయ జయ)

(ఇక్కడ వినండి)

జయ జయ జయ ప్రియభారత
జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ ప్రియభారత
జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియభారత
జనయిత్రీ దివ్య ధాత్రి

జయ జయ సశ్యామల
సుశ్యామ చలచ్చేలాంచల
జయ జయ సశ్యామల
సుశ్యామ చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
ఆ ఆ ఆ…
జయ మదీయ హృదయాశయ
లాక్షారుణ పద యుగళ
జయ జయ జయ ప్రియభారత
జనయిత్రీ దివ్య ధాత్రి

జయదిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయదిశాంత గత శకుంత
దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక
గళ విశాల పత విహరణ
ఆ ఆ ఆ…
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ

జయ జయ జయ ప్రియభారత
జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర
నరనారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియభారత
జనయిత్రీ దివ్య ధాత్రి

వ్రాసినది: యస్.పాలకుర్తి | ఆగష్టు 13, 2008

దేవత (బొమ్మను చేసి)

(ఇక్కడ వినండి)

బ్రతుకంత భాదగా
కలలోని గాధగా
కన్నీటి ధారగా
కరగిపోయే…
తలచేది జరుగదు
జరిగేది తెలియదు..

బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక
బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక
గారడి చేసి గుండెలు కోసి
నవ్వేవు ఈ వింత చాలిక

బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక

అందాలు సృష్టించినావు
దయతో నీవు
మరల నీ చేతితో నీవే తుడిచేవులే
దీపాలు నీవే వెలిగించినావే
గాడాందకారాన విడిచేవులే
కొండంత ఆశ అడియాస చేసి
కొండంత ఆశ అడియాస చేసి
పాతాళ లోకాన తోసేవులే

బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక

ఒకనాటి ఉద్యాన వనము
నేడు కనము అదెయే
మరుభూమిగా నీవు మార్చేవులే
ఒకనాటి ఉద్యాన వనము
నేడు కనము అదెయే
మరుభూమిగా నీవు మార్చేవులే
అనురాగ మధువు అందించి నీవు
హాలాహల జ్వాల చేసేవులే
ఆనంద నౌక పయనించు వేళ
ఆనంద నౌక పయనించు వేళ
శోఖాల సంద్రాన ముంచేవులే

బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక
గారడి చేసి గుండెలు కోసి
నవ్వేవు ఈ వింత చాలిక
బొమ్మను చేసి ప్రాణము పోసి
ఆడేవు నీకిది వేడుక

పాత టపాలు »

వర్గములు: